నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 6 గురు నక్సల్ గుర్తింపు పూర్తి : బస్తర్ ఐజీ

Published on 

నారాయణపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు మావోయిస్టులను గుర్తించినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు సీపీఐ (మావోయిస్ట్) డివిజనల్ కమిటీ (డీవీసీ) సభ్యులు కాగా, మరో ముగ్గురు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కంపెనీ నంబర్ 3కి చెందిన మాడ్ డివిజన్ సభ్యులన్నారు. మరో ఇద్దరు మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని, గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

నారాయణ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జాయింట్ ఆపరేషన్‌లో నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, కంకేర్ జిల్లాల జిల్లా రిజర్వ్ గార్డు (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) 53తో పాటు పాల్గొన్నట్లు తెలిపారు. “ఈ ఆపరేషన్ మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగిందని, ఇందులో మహిళా కమాండోలు ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన అన్నారు.
ఘటనా స్థలం నుంచి ఒక INSAS రైఫిల్‌, రెండు 303 రైఫిల్‌, 315 బోర్‌ రైఫిల్‌ మూడు, ఒక BGL లాంచర్‌తో పాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఇతర రోజువారీ ఉపయోగకరమైన పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఐజీ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో ఇతర మావోయిస్టులు మరణించడమో లేదా గాయపడి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

జూన్ 12 అర్ధరాత్రి, కుతుల్, ఫరస్‌బెడ, కొడ్తమెట, అడింగ్‌పర్ గ్రామంలో మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందిందని, సమాచారాన్ని ధృవీకరించుకొని జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్‌కు బయలుదేరగా జూన్ 15 న, ఉదయం 07:00 గంటలకు, కుతుల్-ఫరస్‌బెడ,కొడ్తామెటా అడవులలో, భద్రతా బలగాలను చంపి ఆయుధాలను దోచుకోవాలనే ఉద్దేశ్యంతో మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, ”అని ఐజి చెప్పారు.

వెంటనే రంగంలోకి దిగిన లొంగిపోవాలని పిలుపునిచినప్పటికీ, మావోయిస్టులు పట్టించుకోకుండా కాల్పులు జరిపారని ఆయన పేర్కొన్నారు. “పోలీసు పార్టీ ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చిందని తెలిపారు.

రోజంతా జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమను చుట్టుముట్టడం చూసిన మావోయిస్టులు దట్టమైన అడవులు, కొండలను మధ్య ఎదురుకాల్పలు జరుపుతూ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయారన్నారు. కాల్పులు అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో పరిశీలించగా ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు.

మరణించిన నక్సల్స్‌లో సుద్రూ, వర్గీస్, మమత ముగ్గురు DVC సభ్యులనీ, సమీర, కోసి,మోతీలను PLGA కమాండర్లుగా గుర్తించినట్లు ” ఐజీ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన వేరు వేరు సంఘటనలలో మొత్తం 131 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form