యూపీ ఎమ్మెల్యేపైలైంగిక దాడి కేసు

Published on 

బెంగుళూరు: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన శివ‌సేన పార్టీ ఎమ్మెల్యే భ‌గ‌వాన్ శ‌ర్మ అలియాస్ గుడ్డు పండిట్‌పై లైంగిక దాడి కేసు న‌మోదు అయ్యింది. 40 ఏళ్ల మ‌హిళ‌ను బెదిరించి అత్యాచారం చేసిన‌ట్లు బెంగుళూరులో ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ మ‌హిళ త‌న మైన‌ర్ కుమారుడితో క‌లిసి.. ఆగ‌స్టు 14వ తేదీన యూపీ నుంచి బెంగుళూరుకు వ‌చ్చింది. ఎమ్మెల్యే భ‌గ‌వ‌న్ శ‌ర్మ ఆదేశాల ప్ర‌కారం ఆమె ఆ ట్రిప్ వెళ్లింది. అయితే ఆ రోజున ఆమెతో పాటు ఎమ్మెల్యే అనేక ప్రాంతాల్లో టూరు చేశారు. ఆ త‌ర్వాత రోజున‌.. రిట‌ర్న్ వెళ్లే స‌మ‌యంలో.. కెంప‌గౌడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం స‌మీపంలో ఉన్న ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో రూమ్ తీసుకున్నారు. ఆ గ‌దిలో బ‌ల‌వంతంగా ఆమెపై ఆ ఎమ్మెల్యే లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో ఆమెను చంపేస్తాన‌ని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పెర్కొంది.

ఆ మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆగ‌స్టు 17వ తేదీన కేసు రిజిస్ట‌ర్ చేశారు. భార‌తీయ న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 69 కింద కేసు బుక్ చేశారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form