పార్లమెంట్‌లోకి ఆగంతకుడు

Published on 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఆగంతకుడు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి చొరబడటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రైలు భవనం వైపునున్న చెట్టు ఎక్కి కొత్త పార్లమెంట్ భవనంలోని గరుడ గేట్ వద్ద కిందకి దూకి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చూసి అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సమావేశాలు ఆగస్టు 21వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form