బైడెన్‌ను చంపాలనుకున్నా: నేరం ఒప్పుకున్న తెలుగు కుర్రాడు

Published on 

అమెరికాలోని వైట్‌ హౌస్‌పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు కుర్రాడు కందుల సాయివర్షిత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు విచారణ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సందర్భంగా సాయివర్షిత్‌ తన నేరాన్ని కోర్టులో అంగీకరించాడు.

బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కార్ను తీసుకొచ్చేందుకే తాను ఈ దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం అవసరమైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా అడ్డొచ్చిన వారిని చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాడట. సాయి వర్షిత్‌ ఈ విషయాలు అన్నింటినీ కోర్టులో తెలిపినట్లుగా యూఎస్‌ అటార్నీ వెల్లడించింది. ఈ కేసులో సాయి వర్షిత్‌ ఉద్దేశపూరితంగానే దాడికి పాల్పడినట్లు విచారణలో రుజువైందని తెలిపింది. కాగా, కేసు విచారణ పూర్తి చేసిన డిస్ట్రిక్ట్‌ కోర్టు.. ఆగస్టు 23వ తేదీన శిక్ష ఖరారు చేయనుంది.

మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ జన్మతః అమెరికన్ సిటిజన్. సాయి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే విజయవాడ నుంచి అమెరికాకు వెళ్లారు. ఒక తమ్ముడు ఉన్నాడు. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form