కుప్పకూలిన రష్యన్‌ హెలికాప్టర్‌.. సిబ్బంది మృతి

Published on 

రష్యాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో సిబ్బంది మృతి చెందారు.

నైరుతి రష్యాలోని జనావాసాలు లేని కలుగ ప్రాంతంలో ఎంఐ – 28 క్రాష్‌ అయ్యింది. ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్ల (93 మైళ్ల) దూరంలో అడవిలో కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపినట్లు రష్యన్‌ మీడియా నివేదించింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form