మణిపూర్ హింసపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగి ఏడాది దాటుతున్నా.. ఆ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనటం లేదంటూ పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలుపొందటంపై కాకుండా, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని మోడీ పాలన తీరును పరోక్షంగా విమర్శించారు.
సోమవారం నాగపూర్‌లో ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ సందర్భంగా మణిపూర్ అల్లర్ల గురించి ప్రస్థావించారు. మణిపూర్ హింసను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మోహన్ భగవత్ సూచించారు. శాంతి కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా.. పరిస్థితులు మారటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.