బీజేపీ కుల, మతాల మధ్య చిచ్చు పెడుతుంది : రేవంత్ రెడ్డి

Published on 

రాజ్యాంగాన్ని మార్చే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పేదల హక్కులు కాపాడుకోవాలంటే మోదీని గద్దె దించాలని కోరారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని పటాన్ చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు.

పటాన్ చెరువును ఒక మినీ ఇండియా అని అభివర్ణించిన రేవంత్ రెడ్డి. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారన్నారు. పటాన్ చెరు అభివృద్ధి కావాలంటే నీలం మధును గెలిపించాలని కోరారు. సుప్రీం కోర్టులో ముదిరాజులకు సంభందించిన అంశం పెండింగ్ లో ఉందన్నారు ముఖ్యమంత్రి. ముదిరాజ్ బిడ్డను గెలిపిస్తే ఆ పని దగ్గరుండి చూసుకుంటారన్నారు . పటాన్ చెరు కార్నర్ మీటింగ్‌కు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form