టెక్సాస్: అమెరికాలోని రిపబ్లికన్ అభ్యర్థి ఇస్లాం మత గ్రంధం ఖురాన్‌కు నిప్పుపెట్టింది. తమ రాష్ట్రంలో ఇస్లాం లేకుండా చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది.
టెక్సాస్‌లో రిపబ్లికన్‌గా పోటీ చేస్తున్న వాలెంటినా గోమేజ్(Valentina Gomez) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. తన వార్నింగ్‌కు చెందిన వీడియోను ఆమె సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. టెక్సాస్‌లో ఇస్లాంను అంతం చేయడమే తన లక్ష్యమని, తమ రాష్ట్రాన్ని ముస్లింలు విడిచి వెళ్లాలని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచార శైలిలో ఆమె వీడియోను రిలీజ్ చేసింది.
క్రైస్తవ దేశాలను ముస్లింలు హింసతో బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పింది. తన లక్ష్యం నెరవేరేలా ప్రజలు సహకరించాలని ఆమె అన్నారు. క్రైస్తవ దేశాలను ఓవర్టేక్ చేసేందుకు ముస్లింలు రేప్‌లు, హత్యలకు పాల్పడుతున్నట్లు తన ఎక్స్ అకౌంట్‌లో ఆమె ఆరోపించింది. “మనం ఇస్లాంను పూర్తిగా ఆపకపోతే మీ కుమార్తెలు అత్యాచారం చేయబడతారు, మీ కుమారులు శిరచ్ఛేదం చేయబడతార” అని గోమెజ్ ఖురాన్‌ను తగులబెట్టేముందు వ్యాఖ్యనించినట్లు తెలుస్తోంది.
"అమెరికా ఒక క్రైస్తవ దేశం కాబట్టి ఆ ఉగ్రవాద ముస్లింలు 57 ముస్లిం దేశాలలో దేనికైనా వెళ్ళవచ్చని. ఒకే ఒక్క నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయనే ఇజ్రాయెల్ దేవుడ" ని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదాస్సద వీడియో, దాని సందేశం ప్రస్తుతం ప్రస్తుతం ఆమె డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
