గుజరాత్‌లో దారుణం.. ర్యాగింగ్‌కు వైద్య విద్యార్థి బలి

Published on 

గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌కు ఓ వైద్య విద్యార్థి బలయ్యాడు. పటాన్‌లోని ధర్‌పూర్‌లో గల జీఎమ్‌ఈఆర్‌ఎస్‌ మెడికల్‌ వైద్య కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్‌ మథానియా అనే విద్యార్థి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, శనివారం రాత్రి ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులతో సీరియర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌లో భాగంగా అనిల్‌ను సీనియర్లు దాదాపు మూడు గంటల పాటు నిలబెట్టారు. దీంతో అనిల్ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి చేరుకుని కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. చికిత్స పొందుతూ అనిల్‌ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సీనియర్‌ విద్యార్థుల ర్యాగింగ్‌ వల్లే అనిల్‌ మరణించాడంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్‌ విద్యార్థులపై మేనేజ్‌మెంట్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సదరు విద్యార్థులను హాస్టల్‌, కళాశాల నుంచి సస్పెండ్‌ చేసినట్లు మెడికల్‌ వైద్య కళాశాల అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై ఈ చర్యలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form