- రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి పుష్ప2
- 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూళ్లు
పుష్ప 2 చిత్రం మరో రికార్డు నెలకొల్పింది. రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో, తెలుగు సినిమాల లిస్ట్‌లో ప్రథమ స్థానంలోకి వచ్చింది. దంగల్ రూ. 2 వేల కోట్లకుపైగా సాధించింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ రెండో ప్లేస్‌లో ఉన్న బాహుబలి 2 రూ.1810 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు రాబట్టినట్టు పుష్ప 2 టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేఫథ్యంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2024 డిసెంబర్ 17న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది.