ఎన్‌కౌంట‌ర్ కేసులో మాజీ ఎస్పీకి ప‌దేళ్ల జైలుశిక్ష‌

Published on 

చండీఘ‌డ్‌: ఎన్‌కౌంట‌ర్ కేసులో మాజీ ఎస్పీ ప‌రంజిత్ సింగ్‌కి ప‌దేళ్ల జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. పంజాబ్‌లోని బియాస్‌లో ఎస్‌హెచ్‌వోగా చేసిన ప‌రంజిత్ సింగ్‌కు ఈ శిక్ష ప‌డింది. 1993లో ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను అమృత్‌స‌ర్‌లో ఫేక్ ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఈ కేసులో మరో ముగ్గుర్ని దోషులుగా తేల్చింది కోర్టు.

కానిస్టేబుల్ సుర్ముక్ సింగ్‌, కానిస్టేబుల్ సుఖ్వింద‌ర్ సింగ్‌ను 1993, ఏప్రిల్ 18వ తేదీన పోలీసులు తీసుకెళ్లారు. వాళ్లను అక్ర‌మంగా బంధించి ఆ త‌ర్వాత మ‌జీతా పోలీసులు ఆ ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను ఫేక్ ఎన్‌కౌంట‌ర్‌లో చంపేశారు. నాలుగు రోజుల త‌ర్వాత ఆ ఇద్ద‌రి మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

అంత్య‌క్రియ‌ల త‌ర్వాత ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు మిలిటెంట్ల‌ను కాల్చి వేసిన‌ట్లు మ‌జీతా పోలీసు ధ‌రం సింగ్ ప్ర‌క‌టించారు. ఎన్‌కౌంట‌ర్ అంశంలో విచార‌ణ అవ‌స‌రం లేద‌ని పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు 1995, డిసెంబ‌ర్ 26వ తేదీన ఈ కేసులో సీబీఐ విచార‌ణ మొద‌లుపెట్టారు. బాధితుల పేరెంట్స్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందిన ఇద్ద‌ర్ని సుఖ్వింద‌ర్‌, సుర్ముక్‌గా సీబీఐ విచార‌ణ‌లో తేల్చారు. సుదీర్ఘ కాల విచారణ అనంతరం మాజీ ఎస్పీ పరంజిత్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ఝ విధించింది సీబీఐ కోర్టు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form