లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అది తెలంగాణలో ప్రధాని చివరి ఎన్నికల ప్రచార సభ కావడంతో కమలనాథులు భారీ సంఖ్యలో జన సమీకరణ చేశారు.
అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్టేజీపైకి వెళ్లేందుకు ఆయనకు ఎస్పీజీ సిబ్బంది అనుమతి నిరాకరించారు. నిర్దేశించిన సమయాని కన్నా లేటుగా రావడంతో ఆయనను సభా వేదికపైకి అనుమతించలేదు. సభా వేదికపైకి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజల మధ్యలోనే రాజాసింగ్ కూర్చోవలసి వచ్చింది. పిలిచి అవమానించారని పోలీసులపై రాజాసింగ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాదవిలత ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్న రాజాసింగ్ ఈ పరిణామంతో మరింత దూరం జరిగే అవకాశం ఉందంటున్నారు ఆయన అనుచరులు.