ప్రభాస్ పెళ్లి ఫిక్స్

Published on 

 పాన్ ఇండియా స్టార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. డార్లింగ్ పెళ్లి ఎప్పుడెప్పుడా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా మరోసారి  ప్రభాస్ పెళ్లి వార్త  తెరపైకి వచ్చింది. అయితే ఇటీవలే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి  కాకినాడ జిల్లా తునిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అంతేకాకుండా అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజ కూడా చేయించారు.  అయితే ఈ పూజలు చేయడం  వెనుక ప్రభాస్ పెళ్లి కారణమని  సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ప్రభాస్ వయసు నలభై ఐదు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరగా పెళ్లి జరగాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన వివాహం జరగాలని శ్యామలా దేవి ఈ పూజలు చేశారని అంటున్నారు. శ్యామలా దేవి ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. త్వరలోనే తమ అభిమాన హీరో పెళ్లి కబురు చెబుతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form