థింపు: ప్రధాని మోదీ ఇవాళ ఉదయం భూటాన్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ కు బయల్దేరి వెళ్లారు. థింపు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోదీ పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక నిందితుడికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధాని భూటాన్ కు బయలుదేరే ముందు.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు.























