ప్రముఖ నటి తండ్రి కన్నుమూత

Published on 

TG: టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) జూలై 28న కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. తండ్రి మరణం పాయల్‌కు తీరని లోటుగా మారింది. తన బాధను ఆమె సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయ‌గా, ఇది అభిమానులను కలచివేసింది.‘‘నాన్నా… లవ్ యూ, మిస్ యూ’’ అంటూ పాయల్ రాజ్‌పుత్ భావోద్వేగానికి గురయ్యారు. “నాన్నా… నువ్వు ఇక భౌతికంగా నాతో ఉండకపోయినా… నీ ప్రేమ నాలో ఎప్పుడూ ఉంటుంది. నీ నవ్వు, నీ శబ్దం, నీ హత్తుకునే శైలి ప్రతిదీ గుర్తుకువస్తుంది. ఈ లోకం నుంచి నువ్వు వెళ్లిపోయినప్పటికీ, నా హృదయం నుంచి నువ్వు వెళ్లలేవు. లవ్ యూ పప్పా” అని ఆమె పోస్ట్ చేసింది.

తండ్రికి కీమోథెరపీ జరుగుతోందని గతంలో పాయల్ సోషల్ మీడియాలో తెలిపిన విషయం తెలిసిందే. అప్పట్లోనూ తన తండ్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజలందరి ప్రార్థనలు కోరారు. కానీ, తీవ్రంగా పోరాడినా… చివరికి ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. మేం అంతకన్నా చేయలేకపోయాం… క్షమించు నాన్నా , నేను నీ కోసం నా వంతు కృషి చేశాను నాన్నా… నీ ఆరోగ్యం కోసం, నీ జీవితం కోసం పోరాడాం. కానీ ఈసారి మేము ఓడిపోయాం. మిమ్మల్ని కాపాడలేకపోయాం. క్షమించు నాన్నా అని మరో పోస్టులో రాసుకొచ్చింది పాయ‌ల్ రాజ్‌పుత్ పాయల్ పోస్టు చూసిన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాయ్ లక్ష్మీ, దివి, పాయల్ ప్రియుడు సౌరభ్, తదితరులు సోషల్ మీడియాలో పాయల్‌కి ధైర్యం చెప్పారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలి. నీకు, నీ కుటుంబానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ రాయ్ లక్ష్మీ పోస్ట్ పెట్టింది. ఇక పాయ‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. తెలుగు ప్రేక్షకుల ముందుకి ‘RX100’ సినిమాతో వ‌చ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ఆమె గ్లామర్, నటనకి మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’, ‘మంగళవారం’ వంటి చిత్రాల్లో నటించారు. మంగ‌ళ‌వారం చిత్రం కూడా పాయ‌ల్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. పాయ‌ల్ హీరోయిన్‌గా చేస్తూనే అడ‌పాద‌డ‌పా ఐటెం సాంగ్స్ కూడా చేస్తుంది.

నటి పాయల్ రాజ్‌పుత్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67)

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form