AP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మరోహర్ ప్రతిపాధించగా మిగతా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసన సభ స్ధానం నుండి గెలుపొందిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తర్వాత అత్యధిక స్థానాలతో జనసేన శాసనసభలో ఉండటంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని జనసేన భావిస్తుంది.శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎంపిక జరగడంతో ఆయనను ఎమ్మెల్యేలు అభినందించారు.