హైదరాబాద్ : కన్నబిడ్డ కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని కేసీఆర్ తెలియజేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కవిత సస్పెన్షన్పై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే కవితపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 60 లక్షల పార్టీ కార్యకర్తల మనోభావాల మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి .
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పువన్నారు. కాంగ్రెస్ ఉచ్చులో పడి ఆ పార్టీ చెప్పినట్లు కవిత నడుచుకుంటున్నారని, ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కలహాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.
