- వేసవిలో 71 ఎన్‌కౌంటర్లలో 123 మంది నక్సలైట్లు మరణించారు
- ఆపరేషన్ మాన్‌సూన్‌ను అమలుకు సిద్ధం
- నక్సల్స్ శిబిరాల లక్ష్యంగా ఆపరేషన్
ఛత్తీస్‌గఢ్‌లో రుతుపవనాల రాకతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడంతో సరికొత్త ఎత్తుగడతో ‘ఆపరేషన్ మాన్‌సూన్‘ను సిద్దపడినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా సన్నాహాలు ప్రారంభించినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారడంతో, భద్రతా బలగాలు నక్సలైట్ల ఏరివేతకు యాంటీ నక్సల్ ఆపరేషన్ చర్యలు ముమ్మరంగా చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు 71 ఎన్‌కౌంటర్లలో 123 మంది నక్సలైట్లను హతమార్చినట్లు బస్తర్ ఐజి సుందర్‌రాజ్ తెలిపారు .
ఇప్పుడు యాంటీ నక్సల్ ఆపరేషన్ తో పాటు ఆపరేషన్ మాన్‌సూన్ కూడా నిర్వహించనున్నారని. ఈ ఆపరేషన్‌లో పోలీసు బలగాలు నక్సలైట్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
వర్షాకాలంలో నక్సలైట్లను చుట్టుముట్టేందుకు భద్రతా బలగాలు దూకుడుగా ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని, నదులు, వాగులను దాటుకుని మావోయిస్టుల డెన్ వద్దకు చేరుకునేందుకు సైతం సైనికులను సన్నద్ధం చేశామని తెలిపారు.