సుక్మా: నిన్న తెల్లవారు జూమున చత్తీస్ గఢ్ రాష్రంలోని సుక్మా జిల్లాలో నక్సల్స్ భద్రాతా దళాలమకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించినట్లు బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్ తెలిపారు.
మరణించిన నక్సలైట్ను కెర్లపాల్ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు.అతనిపై రూ. 5 లక్షల బహుమతి వున్నట్లు ఐజీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రెజర్ ఐఈడీ పేలుడు కారణంగా ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే.
ఎన్‌కౌంటర్ స్థలం నుండి బీజీఎల్ లాంచర్ ఆయుధం, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను, మావోయిస్టు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్ తెలిపారు.
