జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం తెల్లవారుజామున మరో ఉగ్రవాదిని భారత బలగాలు మట్టుబెట్టాయి. పహల్గాం టెర్రర్ అటాక్ అనంతరం భారత సైన్యం.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భారత నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ అఖల్ పేరిట కూంబింగ్ చేపట్టింది. బలగాలకు తారసపడ్డ ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఆపరేషన్ అఖల్ శనివారం ఉదయం నాటికి కూడా కొనసాగినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
