ఉరి సెక్టార్‌లో ఎదురు కాల్పులు..జవాన్ మృతి

Published on 

శ్రీనగర్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఉరి సెక్టార్ స‌మీపంలో ఇవాళ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద జ‌రిగిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతిచెందాడు. ఇండియా, పాక్ సైనిక ద‌ళాలు ఫైరింగ్‌కు దిగాయి. చొర‌బాటు య‌త్నాన్ని ఆపే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆర్మీ వ‌ర్గాల ప్ర‌కారం.. ఆగ‌స్టు 12వ తేదీ రాత్రి కొంద‌రు చొర‌బాటుకు ప్ర‌య‌త్నించారు. అయితే రెగ్యుల‌ర్‌కు భిన్నంగా ఈ చొర‌బాటు సాగిన‌ట్లు చెబుతున్నారు.

చొర‌బాటుదారుల‌కు అండ‌గా పాకిస్థాన్ ఆర్మీ ఫైరింగ్ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ బోర్డ‌ర్ యాక్ష‌న్ టీమ్‌లు ఈ ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. చొర‌బాటు జ‌రిగే స‌మ‌యంలో.. ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డ జ‌వాను ఆ త‌ర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అయితే వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డంతో..ఆ వెద‌ర్‌లో చొర‌బాటుదారులు త‌ప్పించుకున్నారు. ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత తొలిసారి పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form