- హైపర్సోనిక్ వార్‌హెడ్‌ను పరీక్షించిన నార్త్‌కొరియా
- ధ్వని వేగం కంటే 12 రేట్లు అధికం
న్యూఢిల్లీ: ఉత్తర కొరియా ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణిని సోమవారం ఉత్తర కొరియా(North Korea) పరీక్షించింది. ఆ మిస్సైల్‌కు హైపర్సోనిక్ వార్‌హెడ్ ఉన్నట్లు ఆ దేశం వెల్లడించింది. ఆ ఆయుధంతో పసిఫిక్ తీరంలోని శత్రు దేశాలను చిత్తు చేయవచ్చు. అయితే ధ్వని వేగం కన్నా అయిదు రెట్లు అధికం వేగంతో వెళ్లడం వల్ల ఇలాంటి మిస్సైల్స్‌ను ట్రాక్ చేసి, కూల్చడం వీలు కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో కూడా ఉత్తర కొరియా ఇలాగే హైపర్సోనిక్ మిస్సైల్స్‌ను పరీక్షించినట్లు తెలుస్తోంది. కొత్తగా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి లో కొత్త తరహా ఫ్లయిట్, గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పింది.
సోమవారం జరిగిన పరీక్ష గురించి ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడారు. తాజా పరీక్షతో శత్రువులకు తామేంటో చూపించామన్నారు. మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు.
ధ్వని వేగం కంటే 12 రేట్లు అధికం