బిలాయ్‌లో సాంస్కృతిక కార్యకర్త, ఛగ్ ముక్తి మోర్చా మజ్దూర్ కమిటీ సభ్యుడు కళాదాసు దహ్రియా ఇంట్లో జాతీయ ధర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహించింది. నక్సలైట్లతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.
గురువారం తెల్లవారు జామున ఉదయం 5.30ల ప్రాంతంలో బిలాయ్‌లోని జముల్ లేబర్ క్యాంపులో ఉన్న కళాదాసు ఇంటికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందం దాదాసు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం ఇంట్లో నుండి కళాదాసు కుమార్తె ల్యాప్‌టాప్‌ను, పెన్ డ్రైవ్, మొబైల్ ఫోన్‌లను ఎన్‌ఐఏ బృందం స్వాధీనం చేసుకుంది.
కళాదాస్ దహ్రియా ‘రేలా’ పేరుతో పీపుల్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ (NGO)ని నడుపుతున్నారు. ఈ NGO రైతులు, గిరిజనులు , కార్మికుల కోసం పనిచేస్తుంది. సంస్థ ముసుగులో నక్సల్స్ కార్యకలాపాలు చేపడుతున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 1న జార్ఖండ్ లోని రాంచీ ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కాళిదాసుకు నోటిసులు జారిచేశారు.
అయితే ఈ సోదాల పట్ల సాంస్కృతిక కార్యకర్త కాళిదాసు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికులు, రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్నందుకు ప్రభుత్వం సహించకుండా మా గొంతులను అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించాడు.