- స్వాతంత్య్ర దినోత్సవం వేళ వృద్ధ ముస్లింపై దాడి
- ఈ దేశంలో వుండాలంటే నినాదం చేయాలని డిమాండ్
- గడ్డం కత్తిరించేందుకు యత్నం
ఉత్తరాఖండ్: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఉత్తరాఖండ్‌లోని పౌడీ గర్హ్వాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ‘జై శ్రీ రామ్’ నినాదం చేయాలని ముగ్గురు వ్యక్తులు వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడిచేసి, అతని గడ్డం కత్తిరించడానికి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 15 శుక్రవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన రిజ్వాన్ అహ్మద్ దగ్గర్లోని టీ షాప్‌లో టీ తాగడానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ వున్న ముగ్గురు వ్యక్తులు అహ్మద్‌ను “జై శ్రీరామ్” అని నినాదం చేయాలని డిమాండ్ చేశారు. జై శ్రీరాం అనడానికి అహ్మద్ నిరాకరించడంతో ఆ ముగ్గురు వ్యక్తలు అహ్మద్‌ను దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ, దాడిచేశారు. దాడి చేసిన దుండగులు అహ్మద్ గడ్డాన్ని పట్టుకుని, బలంగా లాగేసి, గడ్డాన్ని కత్తిరించాలని బలవంత పెట్టారు. ఈ ఘటనంతా రికార్డ్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు.
ఘటనను పరిశీలించిన పోలీసు నిందితులను ముఖేష్ భట్, నవీన్ భండారి, మనీష్ బిష్ట్‌గా గుర్తించారు. రాకేష్ లాల్ అనే వ్యక్తి నడుపుతున్న దుకాణంలో అహ్మద్ టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే లోపల ముగ్గురు నిందితులు బాగా తాగి ఉన్నట్లు కనిపించారని అహ్మద్ తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నిందితుల్లో ఒకరైన ముఖేష్ భట్, అహ్మద్‌ను “జై శ్రీరామ్” అని జపించాలని డిమాండ్ చేశాడని ఆరోపించారు. అహ్మద్ నిరాకరించడంతో, భట్ అతని ఇద్దరు సహచరులు అతనిని దుర్భాషలాడడం, దాడి చేసి, బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వారు అతనిని బలవంతంగా “భారత్ మాతా కీ జై”, “జై శ్రీ రామ్” అని నినదించమని బలవంతం చేశారని చివరికి తాను దుకాణం వెనుక నుంచి తప్పించుకొని తన వాహనం వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి నుండి తప్పించుకున్నానని అహ్మద్ పేర్కొన్నాడు. .
వీడియోలో నిందితులు అహ్మద్‌ను దుర్భాషలాడుతున్నట్లు మతం పేరుతో దూషణలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులపై పౌరిలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్ 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), సెక్షన్ 196 (మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 299 (మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన ఉద్దేశపూర్వక హానికరమైన చర్యలు), సెక్షన్ 351(2) (నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 352 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయినట్లు తెలిపారు.
