TS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, ప్రజా గాయకుడు అందెశ్రీ కలిసారు. ఈ సందర్భంగా సీఎం వారికి శాలువాతో సత్కరించి, బుద్దుడి విగ్రహాన్ని బహుకరించారు.
ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గీతాన్ని సినీ సంగీత కీరవాణితో ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఉండే విధంగా దీన్ని సిద్దం చేశారు. ఫైనల్ గీతాన్ని వినిపించేందుకే ఈ బేటీ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ గీతంలో రెండు చరణాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు చరణాల్లోనే తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనున్నది. ఈ గీతాన్ని జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది.