వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బుచ్చన్న ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. బుచ్చన్న గత పది రోజుల క్రితం ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు మహాబూబ్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో నేడు ఉదయం మృతి చెందాడు. బుచ్చన్న మృతికి ఛైర్ పర్సన్ మంగమ్మ, మున్సిపల్ కమీషనర్ నూరుల్ నజీబ్ సంతాపం తెలిపారు.