TS: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు అప్రమత్తమై, ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మళ్లీ సోమవారం నుంచి యథావిధిగా ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
- రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలివే..
- రైలు నంబర్ – 47177(రామచంద్రపురం – ఫలక్‌నుమా)
- రైలు నంబర్ – 47156(ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
- రైలు నంబర్ – 47185(సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
- రైలు నంబర్ – 47252 ( ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
- రైలు నంబర్ – 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్)
- రైలు నంబర్ – 47241 (మేడ్చల్ – సికింద్రాబాద్)
- రైలు నంబర్ – 47250 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
- రైలు నంబర్ – 47201 (ఫలక్‌నుమా – హైదరాబాద్)
- రైలు నంబర్ – 47119 (హైదరాబాద్ – లింగంపల్లి)
- రైలు నంబర్ – 47217 (లింగంపల్లి – ఫలక్‌నుమా)
- రైలు నంబర్ – 47218 (ఫలక్‌నుమా – రామచంద్రపురం)