ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులు బాలికపై పలు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 27న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయ్యా జిల్లా బిదునా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన బంధువైన మహిళతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది. గత కొన్ని నెలలుగా తాత, తండ్రి, బంధువు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె రెండు నెలల గర్భవతిగా నిర్ధారణ అయ్యింది.