AP: పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు. గురు పౌర్ణమి నాడు పుట్టపర్తిలో మెగా పీటిఎమ్ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అమ్మంటే రెండు అక్షరాలు కాదని.. అమ్మను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను విద్యాశాఖ మంత్రి అవగానే ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు, పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాలు ఉండవని.. బడి గేటు బయటనే పాలిటిక్స్ అని చెప్పుకొచ్చారు.
పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు. ప్రతి మొక్కకు గ్రీన్ పాస్ పోస్ట్ ఇస్తున్నామని తెలిపారు. గ్రీన్ పాస్ పోస్ట్ ద్వారా మొక్క పరిస్థితిని తెలుసుకోచ్చన్నారు. 2019లో మంగళగిరిలో ఓడిపోయానని… కానీ కసితో కష్టపడి 2024లో భారీ మెజార్టీతో విజయం సాధించానని అన్నారు. ఒక్క మార్కు తక్కువ వస్తే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని… ఇలా చేయడం తప్పని.. పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.
