ప్రముఖ మరాఠీ నటి ఊర్మిళ కొఠారి కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒకరిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
నటి ఊర్మిళ కొఠారి గురువారం అర్థరాత్రి సినిమా షూటింగ్ నుండి తిరిగి వస్తుండగా ముంబైలోని కంధివాలి ప్రాంతంలో పోయిసార్ మెట్రో ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెర్చుకోవడంతో ఊర్మిళ, ఆమె కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి కూడా గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిర్వహిస్తున్నారు.