- జగన్నాథపురం వై జంక్షన్ వద్ద కరపత్రాలు
- భారీగా భద్రాత బలగాల మోహరింపు
తెలుగు రాష్ట్రల్లో మరో కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ పేరుతో కరప్రతాలు, వాల్ పోస్టర్లను విడుదల చేసింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మావోయిస్ట్ పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏజెన్సీ ఏరియాలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. విస్రతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.























