తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినేత్రి , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొంది. అయితే టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని విమర్శించింది.
కాగా, లోక్‌సభ ఎన్నికలల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి మెరుగైన సీట్లు సాధించింది. 2019లో టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా ఈసారి 29 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీ గతం కంటే దిగజారింది. 2019లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోగా ఈసారి 12 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పైగా కేంద్రంలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తీ మెజారిటీ రాని స్థితిలో ఆమె చేసిన వ్యాక్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.