Delhi : పార్లమెంట్ శీతాకాలం సమావేశాల మొదటి రోజే గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ అవినీతి అంశం దేశాన్ని ప్రభావితం చేస్తోందని ఖర్గే అన్నారు. అదానీకి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. దీంతో అదానీపై అంశంపై విపక్షాలు సైతం చర్చకు పట్టుపట్టాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు.
మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు. కాగా, డిసెంబర్ 20వ తేదీ వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.