గడ్చిరోలిలో మరో ఎన్‌కౌంటర్..ముగ్గురు నక్సల్ మృతి

Published on 

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మరో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్ల‌తో సహా మరో పురుష నక్సలైట్లు మరణించినట్లు గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నిలోప్తల్ తెలిపారు.

పర్మిలి దళానికి చెందిన కొందరు వ్యక్తులు భారీ విధ్వంసానికి పాల్పడే లక్ష్యంతో భామ్రాగడ్ తాలూకాలోని కాట్రంగట్ట గ్రామ సమీపంలోని అడవిలో మకాం వేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందిందని, సీ-60 కమాండోకు చెందిన రెండు బృందాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని, ఈ సందర్భంగా నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారని ఎస్పీ తెలిపారు. అనంతరం భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి ఎస్పీ) నిలోప్తల్ తెలిపారు.

కాల్పులు ముగిసిన తర్వాత ఘటనా స్థలం నుంచి ఒక మగ, ఇద్దరు మహిళా నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. చనిపోయిన నక్సలైట్లలో ఒకరిని పెర్మిలి దళం ఇన్‌చార్జి, కమాండర్ వాసుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, కార్బైన్, ఇన్సాస్ రైఫిల్, నక్సలైట్ సాహిత్యం, ఇతర వస్తువులు కూడా లభించాయని, ఆ ప్రాంతంలో యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form