TS: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితా ను సవరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. లోక్‌సభ లో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దాంతో సభల్లో గందరగోళం ఏర్పడింది. దాంతో ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత ఉభయసభలు పునఃప్రారంభమైనప్పటికీ సేమ సీన్ రిపీట్ అయ్యింది. ఈ క్రమంలో ఉభయసభలను రేపటికి వాయిదా వేశారు.
