HYDERABAD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ హైడ్రామా నడిచింది. నేడు విచారణకు రావాలని పిలవడంతో…ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు కేటీఆర్. ఐతే వెంట లాయర్లను తీసుకెళ్లారు. దీంతో ఏసీబీ అధికారులు న్యాయవాదులతో విచారణకు హాజరయ్యేందుకు అనుమంతించలేదు. తనతో పాటే న్యాయవాదులను అనుమతిస్తేనే విచారించాలన్నారు కేటీఆర్. దీంతో కాసేపు హైడ్రామా నడిచింది. అవినీతి నిరోధక శాఖ అధికారుల నోటీసులకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుల్లో క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ తీర్పు వచ్చే వరకు తనను విచారణకు పిలవవద్దు అన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అన్నారు.
కాగా, తనను న్యాయవాదులతో విచారణకు అనుమంతిచకపోవడంపై కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించాలని చూస్తున్నారని అన్నారు.