కేసీఆర్‌ కిట్లను ఇవ్వడం లేదు: కేటీఆర్

Published on 

TS: కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు.

తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్.. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన తల్లీబిడ్డలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.

2014 కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానాకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form