ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్

Published on 

Hyderabad: ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఏండీఏ నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తొంది. కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేసుకున్న విషయంపై ఆయనను ప్రశ్నించే అవకాశం వున్నట్లు తెలుస్తొంది.

ఇదే కేసులో బుధవారం ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏసీబీ దాదాపు ఆరుగంటల పాటు విచారించింది. ఫార్ములా వ్యవహారం తెరపైకి వచ్చిన మొదలు చివరకు అంతా కేటీఆర్ డైరెక్షన్‌లో జరిగిందని తేల్చి చెప్పారట. అందుకు సంబంధించి తనవద్ద నున్న డీటేల్స్ అధికారులకు ఆయన అందజేసినట్టు తెలుస్తోంది. వాటిలో కేటీఆర్‌తో వాట్సాప్‌లో ఛాటింగ్ చేసిన వివరాలు సైతం ఉన్నాయి.

కాగా.. ఈ కేసుకు సంబంధించి ఈనెల 6న విచారణకు రావాల్సిందిగా తొలుత కేటీఆర్‌‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ ఈనెల 6న న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. చాలా సేపు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం బయటే ఉన్నారు. న్యాయవాదితో కలిసే విచారణకు వస్తానని.. లేకపోతే లేదని తేల్చిచెప్పారు. చివరకు ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా లేఖ రాసి కేటీఆర్ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో కేటీఆర్‌ను, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ విచారణ న్యాయవాదికి విజిబుల్ డిస్టెన్స్‌లో ఉండే విధంగా ఏసీబీ చర్యలు తీసుకుంది.

నిధుల విడుదలకు ముందు ఇటు హెచ్ఎండీఏ, అటు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదని తేల్చి చెప్పారట. స్పెషల్ సెక్రటరీగా పరిమితులకు లోబడే తాను విధులు నిర్వహించానని, తన పరిధిలో రూల్స్ ఏమాత్రం అతిక్రమించలేదని తెలిపారు. ప్రభుత్వ జీవోల ఆధారంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రతీది వీడియో రూపంలో రికార్డు చేశారు అధికారులు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form