విజయ్ క్రేజ్.. బాక్సాఫీస్ షేక్

Published on 

TG: విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రం కింగ్ డమ్. భారీ స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు ట్రైలర్‏తో సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. దీంతో ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు, సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సె కీలకపాత్రలు పోషిస్తుండగా.. జూలై 31న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే జూలై 30న అమెరికాలో ప్రీమియర్ షో రన్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓవర్సీస్ ప్రీమియర్ బుకింగ్స్ లో 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు మేకర్స్ తెలిపారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో కింగ్ డమ్ జోరు కొనసాగుతుంది.

నివేదికల ప్రకారం కింగ్ డమ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే ఒక లక్ష 34 వేలకు పైగా టికెట్స్ అమ్మినట్లు సినీవర్గాలు తెలిపాయి. మొదటి రోజు బుక్ మై షోలో 29.4 వేలకు పైగా.. ఆ తర్వాత రోజు 33.94 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇక మూడవ రోజు 70.34 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సినీవర్గాలు తెలిపాయి. మొత్తం విడుదలకు ముందే ముందస్తు బుకింగ్ అమ్మకాలలో కింగ్ డమ్ సినిమా దుమ్మురేపుతుంది. ఈ సినిమా తెలంగాణ అంతటా 612 షోల ద్వారా లక్షకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కింగ్ డమ్ హవా కొనసాగుతుంది. జూలై 31న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రౌండ్ గా విడుదల చేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్‌డమ్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

నటుడు విజయదేవర

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form