కిమ్‌ కుమార్తె తొలి విదేశీ పర్యటన

Published on 

బీజింగ్‌ : ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ టీనేజ్‌ కుమార్తె కిమ్‌ జు ఆయే తొలిసారి విదేశీ పర్యటనలో కనిపించారు. ఈ నెల 2న ఆమె తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లారు. కిమ్‌ తో కలిసి ఆమె రైలులో బీజింగ్‌కు వెళ్లారు. వారికి చైనాలో ఘన స్వాగతం లభించింది.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన జ్ఞాపకార్థంగా బుధవారం చైనా నిర్వహించిన భారీ సైనిక కవాతులో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు చైనా విజయోత్సవాల సందర్భంగా జరిగే సైనిక కవాతుకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొన్నారు. వీళ్ల సరసన ఆమె పాల్గొనడం అనేక కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ హై ప్రొఫైల్‌ ఈవెంట్‌లో ఆమె పాల్గొనడాన్ని బట్టి కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు భావి వారసురాలిగా ఆమెను పరిచయం చేస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె అధికారికంగా బహిరంగంగా కనిపించడం అదే మొదటిసారి. గతంలో ఆమెను మొదటిసారిగా 2022లో ఉత్తర కొరియాలో బహిరంగంగా పరిచయం చేశారు కిమ్.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form