కర్ణాటకలో సీఎం మార్పుపై క్లారిటీ

Published on 

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం రాజకీయంగా చర్చనీయమవుతోంది. మరో రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సీఎం అవుతారని చెప్పడంతో ఊహాగాణాలు మరింత పెరిగాయి. డీకే శివకుమార్ కూడా తాను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేముందని అన్నారు. దీంతో ఈ అంశం రాష్టవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ఢిల్లీకి వచ్చిన డీకే శివకుమార్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ లేదని స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈవారం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్‌.. ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం సిద్ధరామయ్య బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవనుండగా.. సిద్ధరామయ్య రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు. మరోవైపు డీకే శివకుమార్‌ బుధవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌ గాంధీతో.. డీకే, సిద్ధరామయ్య సమావేశం కానున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం మార్పు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. డీకే శివకుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగడం లేదని తేల్చి చెప్పారు. సీఎం మార్పు ఊహాగాణాలు మీపైపే ఉన్నాయని.. నా వైపు లేదని స్పష్టం చేశారు. 

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form