Bhuwaneshwar: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ రాజ్‌భవన్‌లో హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ భాజపా అధ్యక్షుడిగా, విశాఖపట్నం ఎంపీగా పని చేసిన హరిబాబు.. 2021 నవంబరు 6న మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.