రేపు స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు బంద్?

Published on 

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.. దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు.. వాటి అనుబంధ సంఘాల ఐక్యవేదిక జూలై 9న (బుధవారం) భారత్ బంద్‌ కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక.. జాతి వ్యతిరేక విధానాలను అనుసరించడం.. హక్కులను కాలరాయడం.. కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. గత 10 ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశాలు నిర్వహించకుండా కేంద్రం కాలయాపన చేస్తుందని.. కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా.. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు సహా 25 కోట్లకు పైగా కార్మికులు జులై 9, బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ఈ ‘భారత్ బంద్’ కారణంగా దేశవ్యాప్తంగా అనేక సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.. అధికారిక, అనధికారిక/అసంఘటిత ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో యూనియన్లు కూడా ఈ బంద్ లో పాల్గొననున్నాయి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నుంచి అమర్‌జీత్ కౌర్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. 25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటారన్నారు. గ్రామీణ కార్మికులు కూడా దేశవ్యాప్తంగా నిరసనలలో భాగస్వామ్యం అవుతారని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు గతేడాది 17-సూత్రాల డిమాండ్ పత్రాన్ని సమర్పించినట్లు కార్మిక సంఘాల వేదిక తాజా ప్రకటనలో తెలిపింది.

రేపు భారత్ బంద్ ఎందుకు..?

గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని, కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని, సమిష్టి నిర్ణయాలను బలహీనపరిచేందుకు, యూనియన్ల కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి, ‘వ్యాపారం చేయడంలో సౌలభ్యం’ పేరుతో యజమానులకు అనుకూలంగా ఉండటానికి నాలుగు కార్మిక కోడ్‌లను విధించడానికి ప్రయత్నిస్తోందని యూనియన్ల ఫోరం తన ప్రకటనలో ఆరోపించింది. ప్రభుత్వం దేశ సంక్షేమాన్ని పక్కనపెట్టి, విదేశీ – భారతీయ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, దాని విధానాలను తీవ్రంగా అనుసరిస్తున్న తీరు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుందని ఫోరం పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా సేవల ప్రైవేటీకరణ, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టరీకరణ, కార్మికులను సాధారణీకరణ చేసే విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని తెలిపింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form