దిబ్రూఘర్: అస్సాంలోని దిబ్రూఘర్ పట్టణంలో స్థానిక టీవీ జర్నలిస్ట్ దాడికి గురయ్యాడు. నిర్మాలి గావ్ ప్రాంతం శుక్రవారం రాత్రి దుండగులు దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. గాయపడిన జర్నలిస్ట్ హిరణ్య బోరా మిలన్‌నగర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో కేసు నమోదు చేశాడు.
బోరా, అతని స్నేహితుడు ఇంటికి తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా ఒక దుండగుడు హిరణ్యపై హెల్మెట్, పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తిని మన్కోట్ట ప్రాంతానికి చెందిన నిబరన్ గొగోయ్‌గా పోలీసులు గుర్తించారు. దాడి తర్వాత నిబరన్ గొగోయ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
కాగా ఈ దాడిపై దిబ్రూఘర్‌లోని జర్నలిస్టు బృందం ఈ సంఘటనను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్సాంలో జర్నలిస్టుపై దాడి విపరీతంగా పెరిగాయని, తోటి జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుకు భద్రత కల్పించాలని దిబ్రుగఢ్ కు చెందిన జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ హజారికా అన్నారు. మరోవైపు, గ్రేటర్ దిబ్రుగఢ్ ప్రెస్ క్లబ్ ఈ సంఘటనను ఖండించింది దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
