ఢిల్లీ: జార్ఖండ్ మంత్రి ఒకరు ప్రమాదవశాత్తూ బాత్రూమ్ లో జారి పడ్డారు. దీంతో బ్రెయిన్ ఇంజూరీతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ శనివారం ఉదయం తన ఇంట్లోని బాత్రూమ్‌లో జారిపడ్డారు. దీంతో తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు మంత్రిని హుటాహుటిన జంషెడ్‌పూర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంత్రి మెదడులో రక్తం గట్టకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన్ని ఢిల్లీ ఆస్పత్రికి తరలించినట్లు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తెలిపారు.
మరోవైపు రాందాస్ సోరెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. సోరెన్‌ను హెలికాప్టర్ ద్వారా ఢిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఢిల్లీ అపోలో డైరెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి ఆస్పత్రికి చేరుకున్న వెంటనే చికిత్స ప్రారంభిస్తారని జంషెడ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
