గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌కు సంబంధించి రెండు హాట్ టెస్టులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో జులై 3న ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో పేర్కొంది. స్వల్పకాలిక పరీక్షల్లో భాగంగా 30 సెకన్లు, 100 సెకన్ల పాటు రెండు హాట్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. ఆర్టికల్ కాన్ఫిగరేషన్‌ను వెరిఫై చేసే లక్ష్యంతో ఈ టెస్టులు చేపట్టినట్లు వెల్లడించింది. ‘ప్రొపల్షన్ వ్యవస్థ పనితీరు హాట్ టెస్టులు నిర్వహించిన సమయంలో ముందస్తు అంచనాల ప్రకారమే నార్మల్‌గా ఉంది. ఈ పరీక్షలు సక్సెస్ అయ్యాయని” ఇస్రో స్పష్టం చేసింది. వాస్తవానికి గగన్‌యాన్ ఎస్‌ఎంపీఎస్ (SMPS)కు కావాల్సిన టెక్నికల్ సహకారాన్ని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(LPSC) అందిస్తుంది. ఇది గగన్‌యాన్ ఆర్బిటల్ మాడ్యూల్‌కి కీలక వ్యవస్థ అని ఇస్రో తెలిపింది. అలాగే త్వరలోనే పూర్తి వ్యవధి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఇదిలాఉండగా భారతీయ ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంతో ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించి ఇది కీలకంగా ఉండనుంది. అలాగే ఈ పరీక్షలు కూడా విజయవంతం అవుతున్నాయి. ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు అనేది ప్రపంచ అంతరిక్ష రంగంలోనే భారత స్థానాన్ని మరింత పెంచనుంది. మొత్తానికి ఈ గగన్‌యాన్ అంతరిక్ష యాత్ర 2027 తొలి త్రైమాసికంలో చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు.
