భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని రెడీ అవుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో తొలి మానవరహిత మిషన్ కోసం గగన్‌యాన్-జి1ని ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
గత నాలుగు నెలల్లో ఈ రంగంలో అనేక విజయాలు సాధించామని నారాయణన్ అన్నారు. ఈ ఏడాది చివరిలో, బహుశా డిసెంబర్‌లో మొదటి మానవరహిత మిషన్ జి1ను ప్రయోగించనున్నారు. అర్ధ-మానవుడిలా కనిపించే వ్యోమిత్ర కూడా అందులో ఎగురుతారని ఆయన అన్నారు. భారత్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో గగన్‌యాన్ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు.
ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించిన అనేక ప్రయోగాత్మక ప్రయోగాలను చేపట్టి విజయం సాధించింది. అందులో భాగంగానే అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే దిశలో ఇస్రో మరో అడుగు ముందుకు వేస్తోంది .ఈ నేపథ్యంలోనే గగన్‌యాన్ G1 ప్రయోగాత్మక రాకెట్ ప్రయోగాన్ని 2025 చివరి మాసంలో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి G1 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
