భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-20 (GSAT 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా ఫోరిడాలోని కేప్ కెనవెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్ణాటలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.
వాణిజ్య పరంగా స్పేస్‌ఎక్స్, ఇస్రో మధ్య ఇదే తొలి ప్రయోగం కావడం విశేషం. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో వద్ద ఉన్న రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యం కాకపోవడంతో టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారం తీసుకున్నది.
ఈ ఉపగ్రహాం 14 ఏండ్లపాటు సేవలు అందించనుంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌తో పాటు భారత్ మొత్తాన్ని కవర్ చేసి బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. అదేవిధంగా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఆధునిక కా బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించడం ఇదే మొదటిసారి.