కేన్స్ లో సత్తా చాటిన ఇండియన్ దర్శకులు…రెండు అవార్డ్స్ కైవసం

Published on 

77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియాకు రెండు అవార్డ్స్ దక్కాయి.. మైసూరుకు చెందిన ఫిల్మ్‌మేక‌ర్ చిదానంద ఎస్ నాయ‌క్‌ ఫ‌స్ట్ ప్రైజ్ గెగెలుచుకోగా, మాన్సీ మ‌హేశ్వ‌రిలర్అ మూడ‌వ బ‌హుమ‌తి వ‌రించింది.

చిదానంద పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టెవివిజ‌న్ వింగ్‌లో ఆయ‌న ఏడాది కోర్సు చేశారు. దానిలో భాగంగా తీసిన ‘స‌న్‌ఫ్ల‌వ‌ర్స్ వ‌ర్ ద ఫ‌స్ట్ వ‌న్స్ టు నో’ అనే ఫిల్మ్‌కు లా సినెఫ్ అవార్డు ద‌క్కింది. క‌న్న‌డ జాన‌ప‌దుల‌కు చెందిన ఓ మ‌హిళ జీవిత‌క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

లా సినెఫ్ మూడ‌వ బ‌హుమ‌తి కూడా భార‌తీయుల‌కే ద‌క్కింది. బ‌న్నీవుడ్ అనే యానిమేష‌న్ చిత్రం తీసిన భార‌తీయ సంత‌తి మ‌హిళ మాన్సీ మ‌హేశ్వ‌రిని అవార్డు వ‌రించింది. మ‌హేశ్వ‌రి మీర‌ట్‌లో జ‌న్మించారు. ఢిల్లీలోని ఎన్ఐఎఫ్‌టీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. యూకేలోని నేష‌న‌ల్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ స్కూల్లో కూడా ఆమె చ‌దివారు.

ఫ‌స్ట్ ప్రైజ్ గెలిచిన వారికి 15000 యూరోలు గ్రాంట్ ఇస్తారు. రెండో ప్రైజ్ విన్న‌ర్‌కు 11,250 యూరోలు, మూడ‌వ ప్రైజ్ విన్న‌ర్‌కు 7500 యూరోలు ద‌క్కుతాయి. అవార్డు ద‌క్కిన సినిమాల‌ను జూన్ 3వ తేదీన పాంథియ‌న్ థియేట‌ర్‌లో స్క్రీన్ చేస్తారు. గ‌డిచిన అయిదేళ్ల‌లో లా సినెఫ్ అవార్డుల్లో ఇండియాకు ఫ‌స్ట్ ప్రైజ్ ద‌క్క‌డం ఇది రెండో సారి. 2020లో ఎఫ్‌టీఐఐకి చెందిన అస్మితా గుహ నియోగికి అవార్డు ద‌క్కింది. ఆమె క్యాట్ డాగ్ అనే చిత్రాన్ని తీశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form