ఆసీస్ సొంత గడ్డ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా, నాలుగో రోజైన నేడు ఆస్ట్రేలియా జట్టు 10 వికెట్లు కోల్పోయి 238 పరుగులు మాత్రమే చేసింది. హెడ్ (89), మిచెల్ మార్ష్ (47), ఆలెక్స్ (41) పరుగులు మినహా అందరూ విఫలమయారు. బుమ్రా 3, సిరాజ్ 3, సుందర 2 వేకెట్ల తీసి ఆసీస్ ను కట్టడి చేశారు.